ఉత్తరాఖండ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు జనాలు అతలాకుతలం అవుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇప్పటికే కొండచరియలు విరిగిపడి చాలా మంది వరకు చనిపోయారు. మరోవైపు అధిక వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లో విపత్తు లాంటి పరిస్థితి నెలకొందని, ఇప్పటివరకు రాష్ట్రానికి రూ. 1,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మంగళవారం చెప్పారు.
Uttarkashi Avalanche: ఉత్తరాఖండ్ లో హిమపాతంలో చిక్కుకున్న వారికోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.