‘మక్కల్‌సెల్వన్’ విజయ్ సేతుపతి అభిమానులకు సంక్రాంతి పండగ కబురు. దర్శకుడు పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం నుంచి కీలక అప్డేట్ వచ్చింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘పూరి-సేతుపతి’ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను విజయ్ పుట్టినరోజు సందర్భంగ జనవరి 16 ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ అనౌన్స్‌మెంట్ రావడం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. మాస్ ఎంటర్‌టైనర్‌లకు పెట్టింది…