మళ్లీ రాష్ట్రంలో వైకుంఠపాళి వొద్దు.. మళ్లీ వైకుంఠపాళి వస్తే నాశనమైతాం.. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఏపీకి అన్ని పనులు జరుగుతున్నాయి.. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాం.. హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేయండి.. వైకుంఠ పాళి గేమ్స్ వొద్దు అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
విజయవాడ పున్నమి ఘాట్లో నారీ శక్తి విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో పలువురు మహిళా ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి హాజరయ్యారు. ఆమెతో పాటు.. ఈ కార్యక్రమంలో నారా బ్రాహ్మణి, మంత్రులు అనిత, సవిత, కందుల దుర్గేష్ పాల్గొన్నారు.