ఐపీఎల్ 2025లో భాగంగా ధర్మశాల స్టేడియంలో జరుగుతున్న పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ అర్ధాంతరంగా రద్దయింది. బ్లాక్ ఔట్ కారణంగా స్టేడియంలోని ఫ్లడ్ లైట్స్ ఆఫ్ అయ్యాయి. తక్షణమే ప్రేక్షకులను స్టేడియం వీడి వెళ్లిపోవాలని అధికారులు సూచన చేశారు. దాంతో మైదానంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఫాన్స్ అందరూ బయటికి పరుగులు తీశారు. పాకిస్థాన్‌తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ సరిహద్దు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో బ్లాక్ ఔట్ అవుతోంది. ఈ క్రమంలో ధర్మశాలలో కూడా…