Haryana : ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో 'చలో ఢిల్లీ' ఉద్యమం ద్వారా పంజాబ్ రైతులు ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే, హర్యానా పోలీసు అధికారులు, సైనికులు వారిని సరిహద్దులో అడ్డుకున్నారు.
కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ తీరుపై మండిపడ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్. స్నేహపూర్వకంగా వుండే రాష్ట్ర ప్రభుత్వాలంటే కేంద్రంలోని మోడీ ప్రభుత్వాలను అస్సలు పట్టించుకోరని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. రైతుల కోసం ఏం చేసినా కేంద్రానికి నచ్చదని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ‘రైతు పోరాటానికి మా మద్దతు ఉంటుంది. తెలంగాణ ఏర్పడక ముందు కరెంట్ కోతలు తీవ్రంగా ఉండేవి. రోజుకు 10మంది రైతులు చనిపోయేవారు. వ్యవసాయంపై ఇప్పటికీ కేంద్రం ఆంక్షలు విధిస్తోంది. మోటార్లకు మీటర్లు పెట్టాలని…
తెలంగాణ ప్రజల రక్త మాంసాలతో ఏర్పడిన ప్రభుత్వ ఖజానాను సీఎం కేసీఆర్ పంజాబ్ రైతులకు సాయంగా ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. మరి తెలంగాణ రైతులను ఎవరు ఆదుకుంటారని ప్రశ్నించారు. తెలంగాణ రైతులను పంజాబ్ ముఖ్యమంత్రి ఆదుకుంటారా…? అని సెటైర్లు వేశారు. కేసీఆర్ కేంద్ర రాజకీయాల్లో స్థానం సంపాదించుకోవాలనే స్వార్థంతోనే ఢిల్లీ వెళ్లారని విమర్శించారు. ఢిల్లీలో పంజాబ్ రైతులు నిరసన తెలిపినప్పుడు ఒక్క రోజు కూడా సీఎం కేసీఆర్ సంఘీభావం…