సిక్కుల పవిత్ర యాత్రా స్థలంగా ప్రసిద్ధిగాంచిన అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం సమీపంలో వరుస పేలుడు ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ సమీపంలో గురువారం తెల్లవారుజామున పేలుడు శబ్దం వినిపించిందని పలు వర్గాలు తెలిపాయి.
పంజాబ్ అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం వద్ద వరుస పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. గోల్డెన్ టెంపుల్ సమీపంలో మరో పేలుడు సంభవించింది. శనివారం రాత్రి ఓ భారీ పేలుడు జరగగా.. సోమవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో మరో పేలుడు జరిగింది. దీంతో స్వర్ణ దేవాలయానికి సందర్శించడానికి వచ్చిన భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
పంజాబ్ అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం సమీపంలోని దర్బార్ సాహిబ్ దగ్గర శనివారం రాత్రి అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఆరుగురు అమ్మాయిలు స్వల్పంగా గాయపడ్డారు.