Punjab Bandh: ఈరోజు పంజాబ్ రైతులు చేపట్టిన బంద్ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. దీంతో చాలా చోట్ల రహదారులను బంద్ చేసి రైతులు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్నారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Punjab Bandh: దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఖనౌరీ సరిహద్దులో గత 34 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల్‌కు మద్దతుగా ఈరోజు (డిసెంబర్ 30) పంజాబ్ బంద్‌ను రైతులు ప్రకటించారు.