ఈ కేసులో కీలక పరిణామం జరిగింది. ప్రమాదం జరిగిన రోజు రాత్రి బాగా తాగి ఉన్నట్లు మైనర్ పోలీసుల ముందు అంగీకరించినట్లుగా పోలీస్ వర్గాలు ఆదివారం తెలిపాయి. విచారణలో తనకు జరిగిన సంఘటనలన్నీ పూర్తిగా గుర్తుకు రాలేదని అధికారులకు తెలిపాడు.
పూణె యాక్సిడెంట్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారం ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అనంతరం జరిగిన పరిణామాలు మరిన్ని సంచలనాలకు దారి తీసింది.