ప్రముఖ సామాజిక సేవా కర్త, అవినీతి వ్యతిరేక ఉద్యమ నేత అన్నా హజారే అస్వస్థతకు గురికావడంతో గురువారం నాడు ఆయన ఆస్పత్రి పాలయ్యారు. ఛాతి నొప్పితో బాధపడుతుండటంతో హజారే పూణెలోని రుబె హాల్ క్లినిక్ ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షల్లో ఆయన రక్తనాళాల్లో అడ్డంకి ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఈ మేరకు అన్నా హజారేకు వైద్యులు యాంజియోప్లాస్టీ నిర్వహించి గుండెలోని కరోనరీ ఆర్టెరీలో ఏర్పడిన బ్లాకేజీని తొలగించారు. ప్రస్తుతం హజారే ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి మెడికల్…