టాలీవుడ్ మూవీస్ పాన్ ఇండియన్ క్రేజ్ క్రాస్ చేసి.. ఇంటర్నేషనల్ లెవల్లోకి వెళ్లిపోతున్నాయి. తెలుగు సినిమా స్థాయిని గ్లోబల్ రేంజ్‌కు తీసుకెళ్లింది బాహుబలి. కేవలం ఇక్కడే కాదు.. విదేశీ భాషల్లో రిలీజై సత్తా చాటింది. ఇవే కాకుండా మరిన్ని సినిమాలు ఫారన్ లాంగ్వేజ్‌లో విడుదలై సక్సెస్ అందుకున్నాయి. నిజానికి తెలుగు సినీ పరిశ్రమలో డ్రాస్టిక్ ఛేంజ్ మొదలైంది బాహుబలితోనే. బీఫోర్ బాహుబలి.. ఆఫ్టర్ బాహుబలిలా టీటౌన్ స్టాండర్స్ మారిపోయాయి. గ్లోబల్ స్టాయిలో కాలరెగరేసేలా చేసింది బాహుబలి 2.…