Minister Sridhar Babu : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆదివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి మంచిర్యాల జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్ల అమలుపై కట్టుబాటుతో ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉత్తమ భోజనం, మెరుగైన…