తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేశామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రైతులు పండుగ చేసుకోవాలని సూచించారు. రైతు భరోసా విజయోత్సవ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.ప్రజల ఆశీర్వాదంతో జెడ్పీటీసీ, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యే, అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా తనకు అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణలో జరిగిన ఉద్యమాలు తనకు తెలుసని.. భూమి చుట్టూ మన త్యాగాలు, జీవితాలు ఉన్నాయన్నారు.. వ్యవసాయం దండుగా…
CM Revanth Reddy : ఇవాళ్టి ప్రత్యేక ఘట్టంగా సింగరేణి సంస్థ చరిత్రలో మొదటిసారి బయటి రాష్ట్రంలో బొగ్గు తవ్వకాలు ప్రారంభించటంను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. 136 ఏళ్లకు పైగా తెలంగాణ సింగరేణి తన బొగ్గు తవ్వకాలను నిర్వహించి రాష్ట్రానికి వెలుగులు పంచుతుంటే, ఇప్పుడు ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్లో తవ్వకాలు ప్రారంభించడం ద్వారా సింగరేణి సంస్థ భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేస్తుంది అని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ట్విట్టర్…
CM Revanth Reddy : చంద్రవంచ గ్రామ ప్రజలకు కృతఙ్ఞతలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ గ్రామం నుంచి ప్రభుత్వం చేపట్టిన నాలుగు పథకాలను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కొడంగల్ నియోజక వర్గానికి రాష్ట్రంలో ప్రత్యేక స్థానం ఉంటుందని, రైతుకు కాంగ్రెస్‌కు చాలా అనుబంధం ఉంది.. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది.. ఆనాడు 78 వేల కోట్లతో రైతులకు రుణమాఫీ చేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆనాడు చేసిన మంచి పనులను…
నిన్న మొత్తం 3410 గ్రామాల్లో గ్రామసభలు జరిగాయని మంత్రి సీతక్క తెలిపారు. చిట్ చాట్‌లో మంత్రి మాట్లాడుతూ.. "కేవలం 142 గ్రామాల్లోని ఆందోళనలు జరిగాయని స్వయంగా బీఆర్ఎస్ పత్రికలోనే చెప్పారు. అంటే కేవలం నాలుగు శాతం గ్రామాల్లోనే కొంత గొడవ జరిగింది.. అది కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఉద్దేశ పూర్వకంగా చేశారు. అంటే 96% గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో గ్రామసభలు జరిగినట్టు స్పష్టమవుతుంది.
రవాణాశాఖ ఆధ్వర్యంలో ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రవాణా శాఖ సాధించిన విజయాలపై ఐమాక్స్ థియేటర్ పక్కన ఉన్న హెచ్ఎండీఏ గ్రౌండ్లో జరుగుతున్న సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాపాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా రవాణా శాఖ సిబ్బంది సాధించిన విజయాలను గుర్తు చేయాలనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు జరిగే వేడుకల ఏర్పాట్లలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగే ఈ వేడుకల్లో అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందేలా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమానికి రెండోరోజు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేర్కొన్నారు. ప్రజా పాలన కార్యక్రమంలో రెండవ రోజు కార్యక్రమ నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో నేడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొదటి రోజు ప్రజాపాలన ప్రజా సదస్సులలో ఎదురైన సమస్యలను పునరావృత్తం కాకుండా నేడు చర్యలు తీసుకోవడంపట్ల అభినందనలు తెలిపారు.