Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ మరణించారంటూ ఇటీవల ఆ దేశంలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అవినీతి ఆరోపణలతో రావల్పిండిలోని అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్‌ను అసిమ్ మునీర్ నేతృత్వంలోని సైన్యమే హత్య చేసిందనే వదంతులు వ్యాపిస్తున్నాయి. గత నాలుగు వారాలుగా ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు ఎవరిని అనుమతించకపోవడం ఈ వార్తలకు బలాన్ని చేకూరస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ చెల్లెళ్లతో సహా, ఖైబర్ ఫఖ్తుంఖ్వా సీఎంను కూడా అధికారులు…
Imran Khan vs Asim Munir: అసలు పాకిస్తాన్‌లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. రావల్పిండి అడియాలా జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ హత్య చేయబడినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో పాక్ వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. జైలు అధికారులు, రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్‌లు మాట్లాడుతూ.. ఇమ్రాన్ ఖాన్ పూర్తి ఆరోగ్యం ఉన్నాడని ప్రకటన ఇవ్వడం కూడా పరిస్థితిని చక్కబడేలా చేయలేదు.
Imran Vs Asim: ఒక్క సంతకం... కేవలం ఒకే ఒక్క సంతకం... ఒక దేశ చరిత్రను, ఒక శక్తివంతమైన నాయకుడి తలరాతను ఎలా మార్చేస్తుందో తెలుసా? 2019లో ఇమ్రాన్ ఖాన్ పెట్టిన ఆ ఒక్క సంతకం, ఇప్పుడు 2025లో ఆయన ప్రాణాల మీదకు తెచ్చింది. ప్రస్తుతం పాకిస్తాన్ లోని అడియాలా జైలు గోడల వెనుక అసలేం జరుగుతోంది?,
Pakistan : ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల నుంచి పాకిస్థాన్‌లో పరిస్థితులు దారుణంగా మారాయి. దేశంలో ఎక్కడ చూసినా నిరసనలు, రాజకీయ సంక్షోభం ముదురుతున్నాయి.
Pakistan : పాకిస్థాన్‌లోని షాబాజ్ ప్రభుత్వం ప్రతి విషయంలోనూ విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది. కొన్ని నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో పీఎంఎల్-ఎన్ ఎలాగోలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోయింది.
పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ ఏప్రిల్‌లో జైలు నుండి విడుదల అవుతారని ఆ పార్టీ కీలక నేత సర్దార్ లతీఫ్ ఖోసా వెల్లడించారు. తోషాఖానా కేసులో మాజీ ప్రధానికి విధించిన శిక్షను కోర్టు సస్పెండ్ చేసింది, అయితే సైఫర్ కేసు ఒక వారం కూడా నిలబడదని ఖోసా ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు
Pakistan : సుదీర్ఘ రాజకీయ సంక్షోభం తర్వాత ఎట్టకేలకు పాకిస్థాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ 24వ ప్రధాని అయ్యారు. పీటీఐ, సున్నీ ఇత్తెహాద్ కౌన్సిల్ ప్రతిపక్ష అభ్యర్థి ఒమర్ అయూబ్ ఖాన్‌ను ఓడించి షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ కొత్త ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు.
పాకిస్తాన్‌లో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉండటం దాదాపు ఖాయమైంది. ఇమ్రాన్ ఖాన్ పార్టీ - పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) ప్రతిపక్షంలో కూర్చోనుంది. పాలక కూటమిలో నవాజ్ పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్), బిలావల్ భుట్టో జర్దారీకి చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ), ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్ (ఎంక్యూఎం) ఉన్నాయి.
PML-N alliance talks with PPP in Pakistan Elections 2024: పాకిస్థాన్ ప్రజలు ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ ఇవ్వకపోవడంతో.. అక్కడ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ, మరో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్ (పీఎంఎల్-ఎన్) పార్టీ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) అండతో పీఎంఎల్-ఎన్…
Pakistan Election 2024 Results: 2024 పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. స్పష్టమైన మెజారిటీ లేనప్పటికీ.. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీకి అత్యధికంగా 97 సీట్లు వచ్చాయి. పాకిస్తాన్ ఎన్నికల సంఘం (ఈసీపీ) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. మరో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్ (ఎన్)కి 71 సీట్లు దక్కాయి. బిలావల్ భుట్టో సారథ్యంలోని పాకిస్తాన్ పీపుల్స్…