నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ హారర్ మూవీ ‘హనీ’ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ‘పలాస 1978’ వంటి విలక్షణమైన సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న కరుణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం సమాజంలోని మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు మరియు డార్క్ సైకలాజికల్ ఎలిమెంట్స్ చుట్టూ తిరుగుతుంది. OVA ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి…