PS 2 Trailer: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన చిత్రం పొన్నియిన్ సెల్వన్. కల్కి రాసిన ఈ కథను.. మణిరత్నం ఎంతో రీసెర్చ్ చేసి.. ఎంతో భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా తెరకెక్కించాడు. భారీ తారాగణంతో ఎక్కడా తగ్గకుండా బాహుబలి రేంజ్ లో తీశాడు.
ఇండియన్ గేమ్ ఆఫ్ త్రోన్స్ గా పేరు తెచ్చుకున్న ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా సెకండ్ పార్ట్ రిలీజ్ కి రెడీ అయ్యింది. ఏప్రిల్ 28న విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని మణిరత్నం అండ్ టీం అగ్రెసివ్ గా చేస్తున్నారు. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 500 కోట్లని రాబట్టి తమిళనాడులో బిగ్గెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. ఎన్ని కోట్లు వసూల్ చేసినా పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సినిమాకి తమిళనాడు తప్ప మిగిలిన…