పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతీల వారీగా ఓటరు లిస్టుల తయారీ, ప్రచురణపై అధికారులతో చర్చించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి వివరాల ప్రకారం.. అసెంబ్లీ ఓటరు లిస్టుల ఆధారంగా రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలలో వార్డులు, గ్రామ పంచాయతీల వారీగా ఓటరు లిస్టుల తయారీ, ప్రచురణ కొరకు షెడ్యూల్ విడుదల చేయనున్నారు.