షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్‌కు వచ్చేశాక... మైనారిటీలు, హిందువులపై దాడులు పెరిగిపోయాయి. దీంతో దాడులపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోడీకి ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ ఫోన్ కాల్ చేశారు.