బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై ప్రాసిక్యూషన్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనుమతి ఇచ్చారు. ఉద్యోగాల కోసం భూమి కేసులో ఈ ప్రాసిక్యూషన్‌కు రాష్ట్రపతి ఆమోదించారు. ఉద్యోగాల కోసం భూమి కేసులో ఆయనను విచారించేందుకు సీబీఐ అనుమతిని ఢిల్లీ కోర్టుకు సమర్పించింది.
ప్రజాప్రతినిధుల లంచాల కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పు వెలువరించింది. పార్లమెంటు, శాసనసభల్లో ఎవరైనా సభ్యులు అవినీతికి పాల్పడితే వారిని విచారించే విషయంలో ఎలాంటి మినహాయింపు లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది.