ఇదిలా ఉంటే, తాజాగా అరుణాచల్ ప్రదేశ్ గురించి అడిగిన ప్రశ్నకు చైనా డీప్ సీక్ సమాధానం ఇచ్చేందుకు నిరాకరించింది. భారతదేశంలో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమని పలుమార్లు చైనా క్లెయిమ్ చేసింది. ఇది దక్షిణ టిబెట్‌లో అంతర్భాంగంగా డ్రాగన్ కంట్రీ పేర్కొంటోంది. అయితే, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం గురించి ఒక నిర్ధిష్ట ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి చైనీస్ చాట్‌బాట్ నిరాకరించింది. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ ఎక్స్‌లో వైరల్‌గా మారింది.