Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతరించిపోతున్న పులులు, ఏనుగుల సంరక్షణకు ప్రభుత్వం భారీ నిధులను కేటాయించింది. పులుల రక్షణ కోసం అమలు చేస్తున్న ప్రాజెక్ట్ టైగర్, అలాగే ఏనుగుల సంరక్షణకు చేపట్టిన ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కోసం అదనంగా రూ.4 కోట్లను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ అదనపు నిధులు కేటాయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ రెండు పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న…