Andhra Pradesh: పులులు, ఏనుగుల సంరక్షణకు చర్యలు.. అదనపు నిధులు విడుదల
- అంతరించి పోతోన్న పులులు, ఏనుగుల సంరక్షణకు నిధులు..
- ప్రాజెక్ట్ టైగర్ అండ్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కు అదనపు నిధులు విడుదల..
- 4 కోట్ల అదనపు నిధులు విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతరించిపోతున్న పులులు, ఏనుగుల సంరక్షణకు ప్రభుత్వం భారీ నిధులను కేటాయించింది. పులుల రక్షణ కోసం అమలు చేస్తున్న ప్రాజెక్ట్ టైగర్, అలాగే ఏనుగుల సంరక్షణకు చేపట్టిన ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కోసం అదనంగా రూ.4 కోట్లను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ అదనపు నిధులు కేటాయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ రెండు పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అటవీ శాఖ సమర్పించిన ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తదుపరి చర్యలు చేపట్టాలని అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌కి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే విడుదల చేశారు.
Read Also: Ibomma Ravi : కన్ఫెషన్ రిపోర్ట్‌లో వెలుగులోకి సంచలన వివరాలు
Also Read
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- Amaravati - Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
- AP Government: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. EHSపై ప్రభుత్వం కీలక నిర్ణయం
తాజావార్తలు
-
Rohit-Kohli Records: గువాహటిలో రో-కో రికార్డుల జాతర.. దిగ్గజాల ఖాతాలో ఎన్నో ప్రత్యేకతలు!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
Varanasi : రికార్డ్ ధర పలుకుతున్న వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్.. పోటీలో మైత్రి, దిల్ రాజు, నాగవంశీ
-
AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
ట్రెండింగ్
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!