వామ్మో.. అల్-ఫలాహ్ యూనివర్సిటీ కేంద్రంగా చాలా పెద్ద కుట్ర జరిగినట్లుగా తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది. ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత దర్యాప్తు సంస్థలు చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉగ్ర మూలాలు అల్-ఫలాహ్ యూనివర్సిటీలో బయటపడ్డాయి.
ఫ్రొఫెసర్ల వేధింపులతో ఓ జూనియర్ డాక్టర్ నిండు ప్రాణాలను బలితీసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్న జూనియర్ డాక్టర్ దివేష్ గార్గ్ హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే.. ఒక ప్రొఫెసర్ తన కొడుకు థీసిస్‌ను రెండుసార్లు తిరస్కరించాడని.. ప్రొఫెసర్లు నిరంతరం వేధింపులకు పాల్పడటంతోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.