దర్శకుడు రాంగోపాల్ వర్మపై నిర్మాత నట్టి కుమార్ మండిపడ్డారు. ఆయన సినిమాలేవీ రిలీజ్ కాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. తన సంతకం ఫోర్జరీ చేశారంటూ నట్టి క్రాంతి, కరుణలపై వర్మ కేసు పెట్టిన నేపథ్యంలో.. నట్టికుమార్ తీవ్రంగా స్పందించారు. తమ వద్ద నుంచి తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమంటే.. ఆర్జీవీ తన పిల్లలపై తప్పుడు కేసులు పెట్టాడని ఫైరయ్యారు. తమ దగ్గర నుంచి వర్మ డబ్బులు బాగా తీసుకున్నాడని, వాటిని తిరిగి ఇవ్వమని అడిగితే మాత్రం ఫేక్ అంటూ…
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు పుట్టినరోజు నాడు కూడా వివాదం తప్పలేదు. వర్మకు అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతుంటే ఓ నిర్మాత మాత్రం షాక్ ఇచ్చాడు. ఏకంగా బర్త్ డే బాయ్ పై కేసు వేసి సర్ప్రైజ్ చేశాడు. దీంతో ఆర్జీవీ తాజా చిత్రం “మా ఇష్టం” మూవీని ఆపాలంటూ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. విషయంలోకి వెళ్తే… దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనకు 5 కోట్ల 29 లక్షలు ఇవ్వాలని, ఇవ్వాల్సిన ఇవ్వకుండా…
ఏపీలో గత కొన్ని రోజులుగా సినిమా టికెట్ రేట్ల విషయంపై వివాదం నడుస్తున్న విషయం తెల్సిందే. ఇదే విషయంపై ఈరోజు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని భేటీ కానున్నారు. ఇదివరకు ఇండస్ట్రీ నుంచి పలువురు పెద్దలు ప్రయత్నించి విఫలమైన ఈ అంశాన్ని వర్మ ఎలా డీల్ చేయబోతున్నాడు ? అనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఆర్జీవీ, పేర్ని నానిది టైంపాస్ మీటింగ్, ఈ కార్పోరేట్ భేటీలో కేవలం…
ప్రముఖ నిర్మాత నట్టికుమార్ తన వారసుల్ని చిత్రసీమలో నటీనటులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా కుమారుడు క్రాంతితో నట్టికుమార్ స్వీయ దర్శకత్వంలో ‘వర్మ’ (వీడు తేడా) అనే సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి మొదట ‘సైకో వర్మ’ అనే పేరు పెట్టారు. అయితే సెన్సార్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సైకో పదాన్ని టైటిల్ నుండి తొలగించారు. ఈ సినిమాను ఐదు భాషల్లో ఈ నెల 21న విడుదల చేయబోతున్నట్టు నట్టి కుమార్ తెలిపారు. ఓ…
టాలీవుడ్ నిర్మాత నట్టికుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తెలంగాణలో టిక్కెట్ రేట్లు అధికంగా ఉన్న కారణంగా ఇకపై తెలంగాణలో తాను నిర్మించే సినిమాలను విడుదల చేయనని నట్టికుమార్ ప్రకటించాడు. ఏపీలో మూసివేసిన థియేటర్లను తెరుచుకునేలా చర్యలు తీసుకున్న ఏపీ ప్రభుత్వానికి నట్టికుమార్ ధన్యవాదాలు తెలిపాడు. జీవో నంబర్ 35ను రద్దు చేయాలంటూ వైజాగ్ ఎగ్జిబిటర్లు ఎవరూ న్యాయస్థానానికి వెళ్లలేదని.. 224 మందికి తెలియకుండా కొంతమంది కోర్టుకు వెళ్లి ఫిర్యాదు చేశారని నట్టికుమార్ ఆరోపించాడు. Read Also: మహేష్…
ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల వివాదం ముదురుతోంది. చాలామంది అక్కడ టికెట్ రేట్ల వివాదంపై ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదంటూ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన సినిమాలన్నీ ఆంధ్రాలో భారీగానే నష్టాలను ఎదురుకోవాల్సి వచ్చింది. దీంతో కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు స్వచ్చందంగా థియేటర్లను క్లోజ్ చేసుకున్నారు. మరోవైపు సినిమా పెద్దలు సైతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల రేట్ల విషయమై మరోసారి ఆలోచించాలని బహిరంగంగా విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం ఉలకలేదు పలకలేదు. దీంతో…