సన్నీ లియోన్ నటించిన ‘మందిర’ తో విజయాన్ని అందుకున్న విజన్ మూవీ మేకర్స్ ‘సుమతీ శతకం’ అంటూ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంతో ఎం.ఎం. నాయుడు దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. బండారు నాయుడు ఈ కథను అందించగా, సుభాష్ ఆనంద్ సంగీతం సమకూర్చుతున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా హాల్‌స్వామి, ఎడిటర్‌గా సురేష్ విన్నకోట పని చేస్తున్న ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ అమర్‌దీప్ చౌదరి, సైలీ చౌదరి…