(జూన్ 14న నిర్మాత కె.మురారి పుట్టినరోజు)డాక్టర్ కాబోయి, యాక్టరయ్యానన్న మాట తరచూ చిత్రసీమలో వినిపిస్తూ ఉంటుంది. కానీ, డాక్టర్ చదువు మధ్యలో ఆపేసి, డైరెక్టర్ కావాలని చిత్రసీమలో అడుగుపెట్టి, తరువాత ప్రొడ్యూసర్ గా మంచి పేరు సంపాదించారు ‘యువచిత్ర’ అధినేత కె.మురారి. ‘యువచిత్ర’ బ్యానర్ పేరు వినగానే ఆ పతాకంపై రూపొందిన పలు మ్యూజికల్ హిట్స్ మన మదిలో మెదలుతాయి. తొలి చిత్రం ‘సీతామాలక్ష్మి’ మొదలు చివరి సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’ దాకా తమ…