చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. కన్నడ నిర్మాత అనేకల్ బాలరాజ్ (58) దుర్మరణం పాలయ్యారు. బెంగళూరు జేపీ నగరలో నివాసముంటున్న ఆయన మార్కింగ్ వాక్ కు అని వెళ్లి మృత్యువాత పడ్డారు. ఆదివారం ఉదయం ఆయన రోడ్డుపక్కన కారు ఆపి రోడ్డు క్రాస్ చేస్తుండగా ఒక బైక్ అతివేగంతో ఆయనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలరాజ్ తలకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. నిన్నటి నుంచి చికిత్స తీసుకుంటూ…