విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ మూవీతో ఓవర్ నైట్ ఫేమ్ సంపాదించుకుంది ప్రియాంక జవాల్కర్. ఆ తర్వాత ఆమెకు ఇబ్బడి ముబ్బడిగా అవకాశాలు వస్తాయని అంతా ఆశించారు. కానీ ఆ స్థాయిలో కాదు కానీ కొన్ని ఛాన్స్ లైతే దక్కాయి. అలా ప్రియాంక అంగీకరించిన రెండు చిత్రాలు ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ విడుదలవుతున్నాయి. ఇందులో మొదటిది ‘తిమ్మరుసు’ కాగా రెండోది ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’. సత్యదేవ్ లాయర్ పాత్ర పోషించిన ‘తిమ్మరుసు’లో నాయికగా నటించింది ప్రియాంక…