ప్రియాంక జవాల్కర్ మూడు చిత్రాల ముచ్చట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ మూవీతో ఓవర్ నైట్ ఫేమ్ సంపాదించుకుంది ప్రియాంక జవాల్కర్. ఆ తర్వాత ఆమెకు ఇబ్బడి ముబ్బడిగా అవకాశాలు వస్తాయని అంతా ఆశించారు. కానీ ఆ స్థాయిలో కాదు కానీ కొన్ని ఛాన్స్ లైతే దక్కాయి. అలా ప్రియాంక అంగీకరించిన రెండు చిత్రాలు ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ విడుదలవుతున్నాయి. ఇందులో మొదటిది ‘తిమ్మరుసు’ కాగా రెండోది ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’. సత్యదేవ్ లాయర్ పాత్ర పోషించిన ‘తిమ్మరుసు’లో నాయికగా నటించింది ప్రియాంక జవాల్కర్. ఈ మూవీ ఈ నెల 30న విడుదల కాబోతోంది. అలానే ఆమె హీరోయిన్ గా నటించిన మరో సినిమా ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’ ఆగస్ట్ 6న జనం ముందుకు వస్తోంది.
Read Also : “లూసిఫర్” రీమేక్ టైటిల్ ఫిక్స్ ?
Also Read
- World Tribal Day 2026: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం.. గిరిజనులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
- Thani Oruvan 2: రవి మోహన్, నయనతార 'తని ఒరువన్ 2' ఆగిపోయిందా? క్లారిటీ ఇచ్చిన నిర్మాత
- Buchi Babu Sana : బుచ్చి.. నెక్ట్స్ సినిమా ఎప్పుడు బాబు.. ఛాన్స్ ఇచ్చే హీరో ఎవరు?
- DC: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’లో విజయ్ దేవరకొండను తీసుకోవాలనుకున్నారా? అసలు కథ ఇదే!
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ మూవీలో కాలేజీ స్టూడెంట్ గా ప్రియాంక జవాల్కర్ అందాలను బాగానే ఆరబోసిందని చెబుతున్నారు. ఈ రెండు సినిమాలే కాకుండా ప్రియాంక జవాల్కర్… శివ కందుకూరి హీరోగా నటించిన ‘గమనం’ చిత్రంలోనూ నాయికగా చేసింది. సుజనా రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియాంక జవాల్కర్ ముస్లిం యువతిగా నటించగా, కీలక పాత్రలను శ్రియా శరన్, నిత్యామీనన్ చేయడం విశేషం. మొత్తం మీద ఈ యేడాది ద్వితీయార్థంలో ప్రియాంక జవాల్కర్ నటించిన మూడు సినిమాలు విడుదల అవుతున్నాయి.
తాజావార్తలు
-
World Tribal Day 2026: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం.. గిరిజనులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
-
iPhone 17 Pro Max: iPhone 18 రాకముందే iPhone 17 Pro Maxపై భారీ ఆఫర్.. రూ.16 వేల వరకు ఆదా!
-
Vaibhav Sooryavanshi-Brett Lee: అవును, వైభవ్ సూర్యవంశీ వయసు 18 ఏళ్లు అయినా ఎవరికి నష్టం?
-
Thani Oruvan 2: రవి మోహన్, నయనతార ‘తని ఒరువన్ 2’ ఆగిపోయిందా? క్లారిటీ ఇచ్చిన నిర్మాత
-
Mojtaba Khamenei Health: మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై ఉత్కంఠకు తెర.. కొత్త వీడియో విడుదల చేసిన ఇరాన్
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!