నేడు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ప్రియాంక చోప్రా తన జీవితంలో ఓ సంఘటనను ఇటీవల గుర్తు చేసుకున్నారు. ఆ విషయం వింటే వింతగా అనిపిస్తుంది. ‘అపురూపం’ అనే తెలుగు సినిమాతో వెలుగు చూడవలసిన ప్రియాంక చోప్రా అది విడుదల కాకపోవడంతో వేరే చిత్రంతో తొలిసారి జనం ముందు నిలిచారు. అప్పటి నుంచీ కష్టాన్నే నమ్ముకొని ముందుకు సాగిన ప్రియాంక అనతికాలంలోనే అందరి మన్ననలు పొందారు. నేడు హాలీవుడ్ లోనూ పేరు సంపాదించారామె. అమెరికాలో అడుగుపెట్టిన తొలి…