రాజస్థాన్ ఆరోగ్య హక్కు బిల్లుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న ప్రైవేట్ వైద్యులు సోమవారం జైపూర్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఎంఎస్ హాస్పిటల్‌లోని రెసిడెంట్ డాక్టర్స్ హాస్టల్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీలో వేలాది మంది వైద్యులు, వారి కుటుంబ సభ్యులు, మెడికల్ షాపు యజమానులతో పాటు వైద్యవృత్తితో సంబంధం ఉన్నవారు పాల్గొన్నారు.