Vikarabad: శంకర్‌పల్లి సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కారణంగా భారీ ప్రమాదం సంభవించింది. వికారాబాద్ నుంచి శంకర్‌పల్లి వైపు వెళ్తున్న బస్సు, మహాలింగపూరం వద్ద అదుపు తప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఢీకొట్టిన వెంటనే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు కారు మొత్తానికి వ్యాప్తించాయి. దీంతో కారు పూర్తిగా దగ్ధమైంది.