ప్రముఖ ఓలా క్యాబ్స్ కంపెనీ మరో సరికొత్త ప్రీమియం సర్వీస్.. ప్రైమ్ ప్లస్ అనే పేరుతో ప్రారంభించింది. ఈ సర్వీసుతో ఎలాంటి క్యాన్సిలేషన్ రద్దు లేదా కార్యకలాపాల సమస్యలు లేకుండా వస్తుందని ఆ కంపెనీ వెల్లడించింది. ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ ఈ కొత్త ప్లాన్ ను ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. బెంగుళూరులో ఎంపిక చేసిన యూజర్లకు ఈ సర్వీసు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. తర్వలో ఇతర నగరాలకు విస్తరిస్తుందని ఆయన తెలిపారు.