భారతదేశంలో హ్యుందాయ్ కార్లకు ఆదరణ పెరుగుతోంది. హ్యుందాయ్ మోటార్ దేశంలోని అతిపెద్ద వాహనాల విక్రయ కంపెనీలలో ఒకటి. డిసెంబర్ 2024లో హ్యుందాయ్ కార్లపై భారీ తగ్గింపులు ఇస్తోంది. హ్యుందాయ్ వెన్యూలో గరిష్ట ప్రయోజనాలు ఇస్తున్నారు. అదే సమయంలో కార్ల ధరలను జనవరి 1, 2025 నుంచి పెంచుతున్నట్లు ఈ సంస్థ వెల్లడించింది. అయితే.. ఈ ఆఫర్‌లు డిసెంబర్ 31 వరకు వర్తించే అవకాశం ఉంది!