ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీపీసీఆర్ కరోనా టెస్ట్ ధరను తాజాగా ప్రభుత్వం సవరించింది. ఐసీఎంఆర్ గుర్తింపు కలిగిన ఎన్‌ఏబీఎల్ ప్రైవేటు ల్యాబ్‌లలో ఆర్టీపీసీఆర్ ధరను రూ.350గా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం పంపే ఆర్టీపీసీఆర్ శాంపిళ్లను పరీక్షించేందుకు ఒక్కో టెస్టుకు రూ.475, అలాగే ఎన్‌ఏబీఎల్ ల్యాబ్‌లలో అయితే రూ.499 వసూలుచేస్తున్నారు. ఇప్పుడు దానిని రూ.350గా నిర్ణయించారు. ఈ మేరకు ఆస్పత్రులు, ల్యాబ్‌లలో తప్పనిసరిగా సవరించిన రేట్లను ప్రదర్శించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ…