అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నాడు. అధికారం చేపట్టిన నాటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటూ దూసుకెళ్తున్నారు. వలసలను కఠినతరం చేస్తూ.. పలు దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధిస్తూ సంచలనంగా మారారు. తాజాగా యూఎస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విద్యా శాఖను రద్దు చేస్తూ ఉత్తర్వుపై సంతకం చేశారు. వైట్ హౌస్ తూర్పు గదిలోని డెస్క్‌ల వద్ద కూర్చున్న పాఠశాల పిల్లలతో ఒక ప్రత్యేక…
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నాడు. పలు దేశాలపై పన్నుల మోతమోగిస్తున్నారు. భారత్ తమ వస్తువులపై భారీగా సుంకాలు విధిస్తోందని ఆరోపించిన ట్రంప్ ఏప్రిల్ రెండో తేదీ నుంచి తమ ప్రతీకార సుంకాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. భారత వస్తువులపై భారత వస్తువులపై పరస్పర సుంకాలు విధించడం గురించి ట్రంప్ మాట్లాడారు. దీంతో అమెరికాలో ఔషధాల ధరలు పెరిగే అవకాశం ఉన్నందున భారతదేశంపై ట్రంప్ విధించిన సుంకం అమెరికన్లకు…
భారతీయ-అమెరికన్ కాష్ పటేల్ భగవద్గీతపై ప్రమాణం చేసి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) డైరెక్టర్‌గా అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. కాష్ పటేల్ ఎఫ్బీఐకి తొమ్మిదవ డైరెక్టర్. ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో పటేల్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఐసెన్‌హోవర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ భవనంలో US అటార్నీ జనరల్ పామ్ బోండి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. క్రిస్టోఫర్ వ్రే తర్వాత తొమ్మిదవ FBI డైరెక్టర్‌గా కాష్ పటేల్‌ను US సెనేట్ ధృవీకరించిన విషయం తెలిసిందే.…