అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నాడు. పలు దేశాలపై పన్నుల మోతమోగిస్తున్నారు. భారత్ తమ వస్తువులపై భారీగా సుంకాలు విధిస్తోందని ఆరోపించిన ట్రంప్ ఏప్రిల్ రెండో తేదీ నుంచి తమ ప్రతీకార సుంకాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. భారత వస్తువులపై భారత వస్తువులపై పరస్పర సుంకాలు విధించడం గురించి ట్రంప్ మాట్లాడారు. దీంతో అమెరికాలో ఔషధాల ధరలు పెరిగే అవకాశం ఉన్నందున భారతదేశంపై ట్రంప్ విధించిన సుంకం అమెరికన్లకు మెడకు ఉచ్చుగా మారవచ్చని భావిస్తున్నారు. లక్షలాది మంది అమెరికన్లు తమ మందుల కోసం ఎక్కువ చెల్లించాల్సి రావచ్చంటున్నారు.
Also Read:Jaggareddy: హోలీ వేడుకల్లో డప్పు కొట్టి డ్యాన్స్ చేసిన జగ్గారెడ్డి
అమెరికాలో ఉపయోగించే జనరిక్ ఔషధాలలో దాదాపు సగం భారత్ నుంచే ఎగుమతి అవుతున్నాయి. ఈ మందులు బ్రాండ్ నేమ్ మందుల కంటే చాలా చౌకగా లభిస్తున్నాయి. అమెరికాలో వైద్యులు రోగులకు సిఫార్సు చేసే 10 మందులలో తొమ్మిది భారతదేశం వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకున్నవే. కన్సల్టింగ్ సంస్థ IQVIA అధ్యయనం ప్రకారం, భారతీయ జనరిక్ మందులు 2022 నాటికి $219 బిలియన్ల ఆదాకు దారితీయవచ్చు. వాణిజ్య ఒప్పందం లేకుండా ట్రంప్ సుంకాలు కొన్ని భారతీయ జనరిక్ ఔషధాలను ఉపయోగం కానివిగా మారుస్తాయని నిపుణులు అంటున్నారు. దీని వలన కంపెనీలు మార్కెట్ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. దీంతో ఇప్పటికే ఉన్న ఔషధ కొరత మరింత తీవ్రమవుతుంది.
Also Read:Lunar Eclipse: నేడే సంపూర్ణ చంద్రగ్రహణం.. దీని ప్రభావం భారత్ లో ఉంటుందా?
ట్రేడ్ రీసెర్చ్ ఏజెన్సీ – గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) ప్రకారం ఔషధ రంగంలో భారత్ అతిపెద్ద పారిశ్రామిక ఎగుమతి. భారత్ ఏటా దాదాపు $12.7 బిలియన్ల విలువైన ఔషధాలను ఎగుమతి చేస్తుంది. వాటిపై వాస్తవంగా ఎటువంటి పన్నులు చెల్లించదు. అయితే భారత్ కు వచ్చే అమెరికా ఔషధాలపై 10.91 శాతం సుంకం విధించబడుతుంది. అమెరికా విధించే పరస్పర సుంకాలు జనరిక్ మందులు, స్పెషాలిటీ ఔషధాల ధరలను పెంచుతాయి.