ప్రముఖ తమిళ నటుడు సంతానం ప్రధాన పాత్రలో నటించిన హారర్ కామెడీ సినిమా 'డీడీ నెక్స్ట్ లెవెల్' వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా నటుడు సంతానం స్పందించాడు. "మేము ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బ తీసే విధంగా సినిమాను తీయలేదు. అలా ఉంటే కచ్చితంగా మాకు సెన్సార్ నుంచి క్లియరెన్స్ వచ్చి ఉండేది కాదు.