పీఆర్సీ విషయంలో జనసేనపై, తనపై చేస్తున్న కామెంట్లపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పార్టీ సోషల్ మీడియా విభాగానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ అన్న వైఎస్ జగన్ వ్యాఖ్యలపై. పవన్ కళ్యాణ్ స్పందించారు. తాను ప్రజల దత్తపుత్రుడిని అన్నారు పవన్. మంత్రులే ఉద్యోగులను రెచ్చగొట్టారు.ప్రభుత్వానికి అందరూ శత్రువులుగా కనిపిస్తారు ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో తామేదో వారిని రెచ్చగొడుతున్నట్టు వచ్చిన వార్తలపై పవన్ మండిపడ్డారు. పీఆర్సీ…
పీఆర్సీ విషయంలో విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. పీఆర్సీకి సంబంధించి ప్రభుత్వం, ఉద్యోగులూ ఒకే టీం. సమస్యలు ఇరు పక్షాలకూ తెలుసు. కాబట్టి దీనిలో విజయం, వైఫల్యం అంటూ ఏమీ లేదన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఆందోళనలు ప్రజాస్వామ్యంలో ఒక ఎక్స్‌ప్రెషన్ గానే ప్రభుత్వం చూసింది. రాష్ట్ర సొంత ఆదాయం రెండున్నర ఏళ్ళ కిందట ఉన్న దగ్గరే ఆగిపోయిందన్నారు సజ్జల. 80 వేల కోట్లకు పైగా ఆదాయం ఉంటే ఉద్యోగులు…
ఏపీలో హాట్ టాపిక్ గా మారింది పీఆర్సీ అంశం. దీనిపై మంత్రుల కమిటీ భేటీ అయింది. పీఆర్సీ అంశంపై ఉద్యోగుల అసంతృప్తిని సరిదిద్దేందుకు మంత్రుల కమిటీ ప్రయత్నం చేసిందన్నారు సలహాదారు సజ్జల. ఉద్యోగ సంఘాల అనుమానాలు నివృత్తితో పాటు కొన్ని సర్దుబాటు చేశాం. కోవిడ్ కారణంగా ఇబ్బందులు ఉన్నా ఉదారంగానే ఉద్యోగుల కు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు సజ్జల. చాలా అంశాల్లో ఉద్యోగ సంఘాలు అంగీకారానికి వచ్చాయని భావిస్తున్నాం అన్నారు. మళ్ళీ కలిసి పనీ చేస్తాం అన్న…