దేశ వ్యాప్తంగా బుల్లితెర వీక్షకులను అలరించిన ‘మహాభారత్’ సీరియల్ లో భీముడి పాత్రను పోషించిన ప్రవీణ్ కుమార్ సోబ్తి (75) సోమవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. బీఆర్ చోప్రా రూపొందించిన ‘మహాభారత్’ సీరియల్ ఆయనకు నటుడిగా చక్కని గుర్తింపు తెచ్చిపెట్టింది. ‘తన తండ్రి సోమవారం రాత్రి 9.30 లకు ఢిల్లీలోని నివాసంలో గుండెపోటుతో మరణించార’ని ఆయన కుమార్తె నికుణిక తెలిపింది. కేవలం బుల్లితెర నటుడిగానే కాకుండా అమితాబ్ ‘షెహన్ షా’, ధర్మేంద్ర ‘లోహా’తో పాటు ‘ఆజ్ కా…