బుల్లితెర భీముడి కన్నుమూత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా బుల్లితెర వీక్షకులను అలరించిన ‘మహాభారత్’ సీరియల్ లో భీముడి పాత్రను పోషించిన ప్రవీణ్ కుమార్ సోబ్తి (75) సోమవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. బీఆర్ చోప్రా రూపొందించిన ‘మహాభారత్’ సీరియల్ ఆయనకు నటుడిగా చక్కని గుర్తింపు తెచ్చిపెట్టింది. ‘తన తండ్రి సోమవారం రాత్రి 9.30 లకు ఢిల్లీలోని నివాసంలో గుండెపోటుతో మరణించార’ని ఆయన కుమార్తె నికుణిక తెలిపింది. కేవలం బుల్లితెర నటుడిగానే కాకుండా అమితాబ్ ‘షెహన్ షా’, ధర్మేంద్ర ‘లోహా’తో పాటు ‘ఆజ్ కా అర్జున్, అజూబా, ఘాయల్’ తదితర చిత్రాలలో ప్రవీణ్ కుమార్ సోబ్తీ కీలక పాత్రలు పోషించారు.
నటుడిగా మారక ముందు ప్రవీణ్ కుమార్ డిస్క్ త్రో క్రీడాకారుడిగా రాణించారు. నాలుగు సార్లు ఏషియన్ గేమ్స్ లో మెడల్స్ సాధించారు. భారత్ తరఫున 1968, 1972లో ఒలింపిక్స్ గేమ్స్ లో పాల్గొన్నారు. క్రీడాకారుడిగా అర్జున్ అవార్డును కేంద్ర ప్రభుత్వం నుండి అందుకున్నారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో డిప్యూటీ కమాండెంట్ గా పనిచేసిన ప్రవీణ్ కుమార్ 2013లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పోటీ చేశారు.
Also Read
- NANI : నాని ఫ్యాన్స్‌కు నిరాశ.. 'బ్లడీ రోమియో' వాయిదా.. 'OG 2'పై సుజీత్ ఫోకస్
- Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విలన్ ఎవరో చెబితే లక్ష ఇస్తాం!
- kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు
- NBK 111 : రొమాంటిక్ సింహం.. బాలయ్యతో బాలీవుడ్ హీరోయిన్ ఐటం సాంగ్
తాజావార్తలు
-
Suvendu Adhikari PA Murder: పక్కా పథకం ప్రకారమే సువేందు అధికారి పీఏ హత్య..
-
Operation Sindoor: 13 పాక్ విమానాలు, 11 స్థావరాలను లేపేశాం.. సంచలన విషయం బయటపెట్టిన భారత సైన్యం..
-
Minister Seethakka : మహిళా స్వయం సహాయక బృందాలకు శుభవార్త చెప్పిన మంత్రి సీతక్క
-
Pat Cummins: బిగ్ షాక్.. వచ్చే ఐపీఎల్ నుంచి ప్యాట్ కమిన్స్ దూరం..? రూ.113 కోట్లతో భారీ డీల్..
-
Amazon Video-MX Player: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంఎక్స్ ప్లేయర్ విలీనం.. ఇకపై అంతా ఒకే చోట..