'జబర్దస్త్' ఫేమ్ వేణు బాటలోనే మరో నటుడూ సాగాడు. 'జబర్దస్త్' షో తో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న శాంతికుమార్ తుర్లపాటి తాజాగా 'నాతో నేను' పేరుతో ఓ సినిమాను తెరకెక్కించాడు. ప్రశాంత్ టంగుటూరి నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు.