రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి తనకు వ్యూహం ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు అన్నారు. తమకు మెజారిటీ ఉందని, మూడు రాజ్యసభ స్థానాలు తమకే వస్తాయని ప్రసాద్ రాజు ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ అడ్డదారులు తొక్కాలని, ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టాలని చూస్తోందని మండిపడ్డారు. ప్రతిపక్షం అడిగే ఏ అంశంపై అయినా చర్చించటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. త్వరలోనే స్పీకర్ ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు చెప్పారు. ఆదివారం…
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి త్వరలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మరో రెండేళ్ళపాటు అమాత్య పదవి పొందేందుకు వివిధ జిల్లాల నుంచి పోటీ తీవ్రతరం అయింది. అధికారంలో వుండే ఏ పార్టీకి అయినా ఉభయ గోదావరి జిల్లాలు ఆయువుపట్టు. అక్కడ ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీయే అధికారం చేపడుతుంది. ఈ సంప్రదాయం, సెంటిమెంట్ ఎప్పటినుంచో వస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 2019 ఎన్నికల్లో రెండుచోట్ల మాత్రమే టీడీపీ అభ్యర్ధులు…