న్యాచురల్ స్టార్ నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 24 న విడుదలకు సిద్దమవుతుంది. శరవేగంగా ప్రమోషన్స్ చేస్తున్న మేకర్స్.. వరుస అప్డేట్స్ వదులుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. ఇప్పటికే సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఆఖరి పాట సిరివెన్నెల సాంగ్ ని రిలీజ్ చేసి ఆయనకు అంకితమిచ్చారు. ఇక తాజాగా ఆయన రాసిన రెండో పాటను…