ప్రజ్వల్ రేవణ్ణ లాంటి వారిని అస్సలు సహించబోమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం జేడీఎస్ ఎంపీని దేశం విడిచి వెళ్లేందుకు అనుమతించిందని, అభ్యంతరకర లైంగిక వీడియోలను విడుదల చేసిందని ఆరోపించారు. శాంతిభద్రతల సమస్య ఉన్నందున ఈ విషయంలో చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని అన్నారు.
Prajwal Revanna: కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ కుంభకోణం సంచలనంగా మారింది. పలువురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన టేపులు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా 2700 వీడియోలు వెలుగులోకి రావడంతో ప్రజ్వల్ రేవణ్ణ దేశాన్ని వదిలి జర్మనీ వెళ్లాడు.
సార్వత్రిక ఎన్నికల వేళ కర్ణాటక రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కర్ణాటక లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణకు తాజాగా మరో షాక్ తగిలింది.
Prajwal Revanna Sex Scandal: మాజీ ప్రధాని హెడ్‌డీ దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహరం కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రజ్వల్‌కి సంబంధించిన 3000 సెక్స్ వీడియోలు వెలుగులో వచ్చాయి.
లైంగిక వేధింపుల కేసులో మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మనవడు, జేడీయూ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు లుకౌట్ నోటీసు జారీ అయ్యాయి. లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళ ఆరోపించడంతో దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేగింది.
Prajwal Revanna scandal: కర్ణాటకలో జేడీయూ ఎంపీ, మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ వీడియోలో వ్యవహారం సంచలనంగా మారింది. ఇటీవల ఈ వీడియోలు వెలుగులోకి రావడం, ముఖ్యంగా హసన్ జిల్లాలో వైరల్ కావడంతో ప్రజ్వల్ బెంగళూర్ నుంచి జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కి వెళ్లిపోయాడు.
జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వీడియోల వ్యవహారంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. సెక్స్ స్కాండల్ గురించి తెలిసి కూడా జనతాదళ్ (సెక్యులర్)తో బీజేపీ ఇంకా ఎందుకు పొత్తు పెట్టుకుంటోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై డీకే శివకుమార్ మంగళవారం ఎదురుదాడికి దిగారు.
మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో లోక్‌సభ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మహిళలను అవమానిస్తే బీజేపీ సహించదని అన్నారు. కాగా.. ఈ ఘటనలో ఎన్‌డిఎ మిత్రపక్ష అభ్యర్థి ప్రమేయం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.. అయితే కర్ణాటక రాష్ట్రంలో ఎవరి ప్రభుత్వం ఉందని అమిత్ షా ప్రశ్నించారు.
సార్వత్రిక ఎన్నికల వేళ అభ్యంతరకర వీడియోలు కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తున్నాయి. హసన్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపుల ఆరోపణలు దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. దీంతో జేడీఎస్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది.