మాజీ మంత్రి, ప్రముఖ నటుడు బాబు మోహన్ ప్రజా శాంతి పార్టీలో చేరారు. ఆయనకు ఆ పార్టీ అధినేత కేఏ పాల్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన వరంగల్ నుంచి ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేయనున్నారు. ఈ మేరకు కేఏ పాల్ ప్రకటించారు.
తెలంగాణ అభివృద్ది చేసి అప్పులు తీర్చి.. నిరుద్యోగులకు ఉద్యోగాలు.. ప్రతి నియోజకవర్గంలో ఉచిత విద్యా-వైద్యం ఆస్పత్రులు కట్టి అభివృద్ది చేయడానికి ఎమ్మెల్యే అభ్యర్థులకు బంఫర్ ఆఫర్ ఇస్తున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు.
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో 119 సీట్లలో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని కేఏ పాల్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కేసీఆర్ నిజస్వరూపాన్ని చూశారని ఆరోపించారు.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఈ కామెంట్స్ చేశారు. చిరంజీవి జనసేన పార్టీలో చేరతారని తాను ముందే చెప్పానని ఆయన అన్నారు. చిరంజీవి, పవన్ ప్రజలను మోసం చేస్తున్నారు అని చెప్పారు.
KA Paul : కామారెడ్డి ఇండస్ట్రియల్ జోన్ మాస్టర్ ప్లాన్ ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ ఎనిమిది గ్రామాల ప్రజలు ఆందోళనలకు దిగారు.