YSRCP: వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర ముగిసి ఇవాళ్టికి నాలుగేళ్లు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర నేతలు కట్ చేశారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి, ఎంపీ నందిగం సురేష్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. జగన్…
రాష్ట్రంలో పాదయాత్ర అంటే గుర్తొచ్చేది దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి అన్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి 4 ఏళ్ళు పూర్తైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు పుష్ప శ్రీవాణి. విజయనగరం జిల్లా కురుపాం మండల కేంద్రంలో వైసిపి నాయకులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేశారు ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి దంపతులు. అనంతరం ధూళికేశ్వరస్వామి ఆలయం…
ముఖ్యమంత్రి వైయస్.జగన్ చేసిన ప్రజాసంకల్ప యాత్రకు ఇవ్వాళ్టితో (శనివారం) నాలు గేళ్లు పూర్తిచేసుకుంది. ఇడుపులపాయలో దివంగత మహానేత వైయస్సార్ సమాధివద్ద 2017 నవంబర్ 6న పాదయాత్ర ప్రారంభమైంది. రాష్ట్రంలో 13 జిల్లాలను దాటుకుంటూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9వ తేదీన ముగిసింది. 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాల మీదుగా పాదయాత్ర సాగింది. 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. 124 చోట్ల సభలు, 55 ఆత్మీయ…