రాష్ట్రంలో పాదయాత్ర అంటే గుర్తొచ్చేది దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి అన్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి 4 ఏళ్ళు పూర్తైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు పుష్ప శ్రీవాణి. విజయనగరం జిల్లా కురుపాం మండల కేంద్రంలో వైసిపి నాయకులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేశారు ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి దంపతులు.
అనంతరం ధూళికేశ్వరస్వామి ఆలయం నుంచి రావాడ రోడ్డు వరకు ర్యాలీ పాల్గొన్నారు పుష్ప శ్రీవాణి దంపతులు. రావాడ రోడ్డు జంక్షన్ దగ్గర ఉన్న వైఎస్ఆర్.విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆనాడు వై ఎస్. రాజశేఖర రెడ్డి పాదయాత్ర తో చరిత్ర సృష్టిస్తే, ఈరోజు పాదయాత్ర తో చరిత్ర తిరగరాసిన జగన్మోహన్ రెడ్డి అని పుష్ప శ్రీవాణి తెలిపారు. ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల కష్టాలు విని, బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నేను విన్నాను-నేను ఉన్నాను అంటూ వారి సమస్యలను తెలుసుకుని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి అని పుష్ప శ్రీవాణి తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయన్నారు.