బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగ్రహ సభ, నేతలు చేసిన కామెంట్లపై సెటైర్లు వేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… టీడీపీ ఎజెండా ప్రకారమే బీజేపీ సభ నిర్వహించిందన్న ఆయన.. టీడీపీ, బీజేపీ, జనసేన… ఒకరు రాగం అందుకుంటే… మరొకరు పల్లవి అందుకుంటారు అంటూ సెటైర్లు వేశారు. ఎవరైనా ప్రజల సమస్యలపై మాట్లాడితే మేం సమాధానం ఇస్తాం.. కానీ, అలా కాకుండా వాళ్లే దేవాలయాలు కూలగొట్టేయటం, వాళ్లే ఆరోపణలు చేయటం రాజకీయమే అన్నారు. రాష్ట్రంలో…
ఏపీలో బీజేపీ తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. ప్రజాగ్రహా సభలో విశాఖ స్టీల్ ప్లాంట్ గూర్చి చెప్పాలన్నారు. విద్యార్ది నాయకుడిగా పనిచేసిన నా గుండె రగిలిపోతుంది. ఎందరో సమర యోధులు స్టీల్ ప్లాంట్ కోసం అమరులైయ్యారు. మహానీయుల త్యాగాలు ప్రయివేటైజ్ చేయటానికా సభ. ప్రత్యక్ష ఉద్యమంలో నాడు విద్యార్ది నాయకుడిగా పాల్గొన్నాను. ఖచ్చితంగా రాష్ర్టానికి జరిగిన అన్యాయంపై మాట్లాడాలి. రాష్ర్ట నాయకులంతా మోదీతో , నిర్మలా సీతారామన్ తో మాట్లాడాలి. రాజకీయపార్టీలకు ఎజెండా ప్రాధాన్యతలు ఉంటాయి.…
ఏపీలో సినిమా రంగంపై జగన్ సర్కార్ అనవసర జోక్యం చేసుకుంటోందని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. ప్రభుత్వ వైఫల్యాలపై 28వ తేదీన ప్రజాగ్రహ సభ నిర్వహిస్తున్నామన్నారు. కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ ముఖ్య అతిధిగా హాజరవుతారని, రాష్ట్ర ప్రభుత్వం వైఖరి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని ఆహ్వానించామన్నారు. ఆర్ధిక వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం దెబ్బ కొట్టింది. రాష్ట్ర ప్రభుత్వం వనరులు వినియోగించుకోకుండా అప్పులు చేస్తుంది. కాగ్ కూడా అనేక అభ్యంతరాలు లేవనెత్తింది. ఆదాయం సమకూర్చకుండా సంక్షేమానికి…