తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు కొత్త సవాళ్లు ఎదురు కాబోతున్నాయా? సంగ్రామ యాత్రలో చివరి వరకు అదే ఊపు ఉంటుందా? కమలనాథులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? వారి ముందు ఉన్న ప్రశ్నలేంటి? సంగ్రామ యాత్రపై బీజేపీ వర్గాల్లో టెన్షన్! సంగ్రామ యాత్ర పేరుతో రోడ్డక్కారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. ఈ యాత్రపై పార్టీ నేతలు భారీ ఆశలే పెట్టుకున్నారు. ఢిల్లీ నాయకత్వం కూడా ఎన్నో లెక్కలు వేసుకుంటోంది. కేడర్‌ను ఉత్సాహ పర్చేందుకు ఆరంభ…
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈనెల 24 నుంచి తెలంగాణలో పాదయాత్ర చేయబోతున్నారు. ఈ పాదయాత్ర పేరును ఈరోజు ఖరారు చేశారు. చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత పేరును ప్రకటించారు ఎమ్మెల్యే రాజాసింగ్. ప్రాజా సంగ్రామ యాత్ర పేరుతో ఈనెల 24 నుంచి బండి సంజయ్ పాదయాత్రను చేపట్టబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే పాదయాత్రకు సంబందించిన రూట్‌మ్యాప్‌ను ఖరారు చేసిన బీజేపీ, యాత్ర పేరు కూడా ప్రకటించడంతో…