ఉద్యోగాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ రావు అన్నారు. తెలంగాణ వచ్చినప్పటీ నుంచి సరైన ఉద్యోగ నోటిఫికేషన్లు లేక తెలంగాణ యువత తీవ్ర మనో వేదనకు గురవుతుందని ఆయన అన్నారు. అందుకే ఉద్యోగాలపై మాట తప్పి, మడమ తిప్పిన టీఆర్‌ఎస్ సర్కార్ వైఖరికి నిరసనగా కేసీఆర్‌కు బుద్ధి చెప్పేందుకు నిరుద్యోగ సమస్యపై నవంబర్ 12న నిరుద్యోగ మిలియన్ మార్చ్ ఉంటుందని ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన కార్యాచరణను ప్రదీప్‌రావు ప్రకటించారు.…